మంచికోసం,మానవ సంక్షేమం కోసం,ధర్మం కోసం,ధర్మసంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న ప్రేరణతో ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవం 'బక్రీద్' పర్వదినాన్ని పురస్కరించుకుని పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలను ఎమ్మెల్యే కిలారి రోశయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సచ్ఛీలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకుంటూ, మనోవాంఛల త్యాగం మానవాళి పొందాలని బక్రీద్ పర్వదిన సందేశం అని ఆయన అన్నారు.