సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పలు కొత్త మార్పులు వచ్చాయి. ట్విట్టర్ యూజర్లు ఇతరుల ట్విట్‌లను చూడాలంటే తప్పనిసరిగా లాగిన్ అవ్వాలనే నిబంధన వచ్చింది. ఇది వరకు లాగిన్ అవ్వకపోయినా వెబ్ బ్రౌజర్ ద్వారా ఇతర ఖాతాదారుల ట్విట్లను చూసే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఆ సౌకర్యాన్ని ట్విట్టర్ నిలిపివేసింది. అలాగే ఖాతాదారులు రోజుకు 1000, కొత్త యూజర్లు 600 ట్విట్లను మాత్రమే చూడగలరు. ట్విట్టర్ నుంచి భారీ ఎత్తున డేటా చౌర్యం జరుగుతోందని, వాటిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చెప్పారు.