కర్ణాటకలోని గదగ జిల్లా హీరేకొప్ప గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇంటివద్ద అలజడి రేపిన పామును సిద్ధప్ప మద్యం మత్తులో పట్టుకున్నాడు. తన చేతిలో గరుడ రేఖ ఉందని..పాము కాటు వేయదంటూ పామును పట్టుకోగానే.. అది అతన్ని 4 సార్లు కాటేసింది. దీంతో సిద్ధప్ప కుప్పకూలిపోయాడు. అందరూ తాను చనిపోయాడనుకోని అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యలో ఒక్కసారిగా అతను లేచి కూర్చోవడంతో షాక్ కు గురై అతని ఆసుపత్రికి తరలించారు.