మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ రహదారి(నాగ్ పూర్-ముంబై)పై రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. నిన్నటి బస్సు ప్రమాదంలో 26 మంది మృతి చెందగా.. గత డిసెంబర్ నుంచి ఈ హైవేపై జరిగిన 39 ప్రమాదాల్లో మొత్తం 88 మంది చనిపోయారు. అధికారులు స్పందిస్తూ.. అతివేగం, డ్రైవర్లు నిద్రపోవడం, వాహనాల టైర్లు పేలడం వల్లే అత్యధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయని అంటున్నారు.