టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో 82. 64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు జరిగిన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఓకేషనల్ కు 1, 717 మంది విద్యార్థులు హాజరు కాగా 1, 419 మంది పాసై 82. 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 820 ఉండగా బాలికలు 599 మంది ఉన్నారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికల కంటే బాలురే అధికంగా ఉండడం విశేషం.