ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్‌కి టమాటా దెబ్బ తాకింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ స్టోర్లలో బర్గర్లు, రాప్‌ల నుంచి టమాటాలను తొలగించనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. నెల వ్యవధిలో టమాటా ధరలు రూ.250 నుంచి రూ.300 వరకు రికార్డు స్థాయిలో పెరిగాయి. అలాగే నాణ్యమైన టమాటాలు దొరకడం లేదు. ఈ క్రమంలోనే న్యూఢిల్లీ, నోయిడాలోని మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌కి నోటీసులు అందించామని సంస్థ పేర్కొంది. టమాటాలు లేకుండానే తమ ఉత్పత్తులు అందించనున్నట్లు పేర్కొంది.