దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ పాయింట్ల వద్ద లాభపడి 65,682.17, నిఫ్టీ 95.80 పాయింట్ల వద్ద లాబపడి 19,450.25 దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.43గా ఉంది. యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, మారుతీ తదితర కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 410 పాయింట్లు లాభపడి 65,754 పాయింట్లకు పెరిగింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 126 పాయింట్లు మెరుగుపడి 19,482 పాయింట్లకు చేరింది. 1943 కంపెనీల షేర్లు వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. 930 షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 131 షేర్లు ఫ్లాట్ గా ఉన్నాయి.
బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. యూపీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, బజాజా ఫైనాన్స్ షేర్లు ఇవాళ మోస్ట్ యాక్టివ్ గా ఉన్నాయి.