తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువ గళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా లోకేష్ కి సంఘీభావంగా మూడు కిలోమీటర్లు చైతన్య రథయాత్రను మంగళవారం టిడిపి నాయకులు నిర్వహిస్తున్నారు. టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన సమీకరణతో రథయాత్రకు బయలుదేరారు.