దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ద్రవ్యోల్భణం భారీగా పెరిగింది. మే నెలలో 4.31గా ఉన్న రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో 4.81కి చేరుకుంది. బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం. జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 4.49 శాతంగా నమోదైంది. తృణధాన్యాలు, మాంసం, చేపలు, గుడ్లు, పాలు, కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, దుస్తులు, ఇంధనం ధరలు మే నెలతో పోలిస్తే జూన్‌లో బాగా పెరిగాయి.