భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా అడుగుపెట్టేందుకు ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజం టెస్లా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. ఏటా ఐదు లక్షల ఈవీలను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని ఎలాన్ మస్క్ కంపెనీ ప్రణాళికలు చేస్తోందట. ఇక భారత్‌లో ఈవీల ప్రారంభ ధర రూ.20 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.