ఏపీలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా, తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. అలాగే, డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లను ఈ నెల 17 వరకు, వెబ్ ఆప్షన్లను ఇచ్చేందుకు ఈ నెల 20 వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.