ఉత్తర కోస్తాంధ్రపై 5.8 కిలో మీటర్ల ఎత్తున గాలులతో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. అలాగే పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం తీవ్రమైతే ఈ నెల 18 నుంచి తెలంగాణలో భారీ వర్షలు పడే సూచనలున్నాయి.