తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణిని నెల రోజులపాటు మూసివేయాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల (ఆగస్టు) 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసి వేయనున్నట్టు ప్రకటించారు. పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మరమ్మతుల కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa