ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మెటార్స్ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.3,202 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.5,006.6 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. కాగా ఈ త్రైమాసికంలో ఖర్చు 98,266.93 కోట్లుగా ఉందని టాటా మోటార్స్ తెలిపింది. వాణిజ్య వాహనాల ద్వారా వచ్చే ఆదాయం 4.4 శాతం పెరిగి 17 వేల కోట్లుగా ఉంది. ప్రయాణికుల వాహనాల ద్వారా వచ్చే ఆదాయం 11 శాతం పెరిగింది.