దేశంలో ప్రస్తుతం కళ్ల కలక కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే కళ్ల కలక వ్యాధి ఉన్నవారి కళ్లలో కళ్లు పెట్టి చూసినంత మాత్రాన ఇది వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు. వారు వాడిన జేబు రుమాళ్లు పట్టుకోవడం, తలగడలపై పడుకోవడం, వాళ్లు కళ్లలో చేతులు పెట్టుకుని వాటిని మరొకరు పట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కళ్లల్లో చేతులు పెట్టుకోకుండా ఉంటే 90 శాతం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు.