భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
వ్యాధి లక్షణాలు ఇవే..
- కళ్ళు ఎర్రగా మారడం
- కళ్ళ నుంచి తరచుగా నీరు కారడం
- కళ్ళలో మంట, నొప్పి, కొద్దిపాటి దురద
- కను రెప్పలు ఉబ్బడం
- కళ్ల వాపు
- వెలుతురు చూడలేకపోవటం
- కళ్ళలో పుసులు పుట్టడం
- నిద్ర లేచిన తర్వాత కనురెప్పలు అతుక్కుపోవడం