టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత రాయలసీమలో 102, ఉమ్మడి అనంతలో 38 ప్రాజెక్టులను రద్దు చేశారని ఆరోపించారు. ‘సాగునీటి ప్రాజెక్టుల తనిఖీ కార్యక్రమమైనా యుద్ధభేరి’ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.... సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ, వైసీపీ పాలనలో వ్యత్యాసాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన ద్వారా వివరించారు. ఒక వ్యక్తి చేసిన విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే ప్రాజెక్టుల సందర్శనకు సిద్ధమయ్యానని అన్నారు.