అనంతపురం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కమిషన గెజిట్ విడుదల చేసింది. ఏ నియోజకవర్గం ఏ కేటగిరి కిందకు వస్తుందనే విషయాన్ని అధికారికంగా గెజిట్లో పేర్కొన్నారు. గతంలో మాదిరే శింగనమల ఎస్సీ రిజర్వుడు కాగా మిగిలినవి జనరల్ స్థానాలుగానే ఉండనున్నాయి. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టరును కొనసాగిసూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో స్థానికంగానే కలెక్టర్లు నియోజకవర్గానికి ఓజిల్లా అధికారిని ఆర్ఓగా నియమించి ఎన్నికల కార్యకలాపాలు జరిపేవారు. ఇపుడు ఈ శాసనసభ ఎన్నికలకు వారందరినీ ఎన్నికల కమిషన తప్పించేసింది. ఓట్లనమోదులో ప్రస్తుతమున్న ఆర్ఓలపై ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన సూచన మేరకు రాష్ట్ర సీఈఓ మనీ్షకుమార్ మీనా ఈ చర్య తీసుకున్నట్టు తెలిసింది. కలెక్టరు వైజాగ్ నుంచి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి కొత్త ఆర్ఓలను ప్రకటించనున్నారు.