దేశంలో రోజురోజుకి సామాన్యుడికి అభద్రతాభావం ఏర్పడుతుంది అంటే నమ్మక తప్పదు. వివరాల్లోకి వెళ్ళితే... చిత్తూరు జిల్లా, పుంగనూరు పరిధిలోని నక్కబండాలో రైతుపై యువకుల దాడి చేశారు. టమాటాలు అమ్మి పలమనేరు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు దాడికి పాల్పడి రైతు నుంచి నాలుగున్నర లక్షల డబ్బు లాగేసుకుని దుండగులు పరారయ్యారు.అలానే బీర్ బాటిళ్లతో అన్నదాతపై దాడి చేశారు. చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.