కృష్ణా జిల్లా, హనుమాన్‌జంక్షన్ పరిధిలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో పరిశ్రమలకు భూములు కేటాయించి భూనిర్వాసిత రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా అక్రమకేసులతో వేధిస్తోందని జనసేన నాయకులూ వాపోతున్నారు. ఈ సంద్రాభంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. ఈ ప్రక్రియలో జనసేన అధికార ప్రతినిధి నాదెండ్ల మనోహర్‌ను బాపులపాడు మండల జనసేన నేతలు కలిసి సమస్యను వివరించారు. రైతుల్లో మనోధైర్యం నింపేందుకు ఆగస్టు 6న పవన్‌కల్యాణ్ మల్లవల్లి పర్యటనను ఖరారు చేయాల్సిందిగా మనోహర్‌ను బాపులపాడు మండల నేతలు కోరారు. శుక్రవారం టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పవన్‌కల్యాణ్ పర్యటన తేదీ ఖరారు చేస్తారని హామీ ఇచ్చారు.