షుగర్ పేషెంట్స్ బొప్పాయి తినవచ్చా..? అంటే కచ్చితంగా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్, అలాగే మినరల్స్ ఉంటాయి. అంతేకాక ఇందులో విటమిన్ ఏ, బి, సీ, డి ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తగ్గి ఒత్తిడి అదుపులో ఉంటుంది. బొప్పాయి గుండె సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బొప్పాయి తినడం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.