కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం కోతికొండ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్ళితే.... .. మొహర్రం చివరి రోజున పీర్ల చావిడి ముందు టీడీపీ వర్గీయులు సావుసేన్ ఆడారు. దేవుళ్లు యేటికి వెళ్లే సమయంలో సావుసేన్ ఆడుతారా అంటూ వైసీపీ వర్గీయులు ప్రశ్నించగా, మాటమాట పెరిగి గొడవకి దారితీసింది. దీనితో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టి, ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసారు.