ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగే వారికి ప్రమాదం పొంచి ఉంది. వాటర్ బాటిళ్లను పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర రసాయనాల ద్వారా తయారు చేస్తారు. ఆ ప్లాస్టిక్ అనేది రోజులు గడిచేకొద్దీ క్షీణించి హానికరంగా మారుతుంది. ప్లాస్టిక్ కణాలు నీటిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇలా అవ్వడం వల్ల శరీరంలోని హార్మోన్లపై అది ప్రభావం చూపుతుంది. శరీరంలో రొమ్ము క్యాన్సర్ కు కారకమవుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగకండి.