ఒంటరి మహిళను ఓ వాలంటీర్ ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో చోటు చేసుకుంది. పప్పుశెట్టిపాలెం గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ శివప్రసాద్ ప్రేమ పేరుతో ఆమెకు నమ్మించాడు. మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడు. దాంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.