దేశ అత్యున్నత సర్వీసుల్లో ఒకటైన ‘సివిల్ సర్వీసెస్’ పరీక్షకు సంబంధించి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో కొవిడ్ సంక్షోభం కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఓ ఏడాది కోల్పోయిన అభ్యర్థులకు వయో సడలింపు ఇచ్చే ప్రతిపాదన ఉందా? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు గురువారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వయోపరిమితికి సంబంధించి మార్పులు సాధ్యం కాదన్నారు.