చైనా కు చెందిన మొబైల్ కంపెనీ 'హానర్' దాదాపు మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఓ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ కంపెనీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.‘హెలో ఇండియా’ అంటూ పెట్టిన పోస్టర్ను తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. త్వరలో మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.