ప్రపంచంలోనే అత్యధిక టర్నోవర్ కలిగిన కంపెనీగా ప్రముఖ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ నిలిచింది. ఏడాదికి 611 బిలియన్ డాలర్ల రెవెన్యూతో తొలి స్థానంలో ఉంది. వాల్‌మార్ట్ తర్వాత స్థానాల్లో వరుసగా సౌదీ ఆరామ్ కో, అమెజాన్, విటోల్, పెట్రో చైనా, సీఎన్‌పీసీ, ఎక్సాన్ మొబిల్, యాపిల్, స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా, షెల్ కంపెనీలు ఉన్నాయి. ఈ వివరాలను స్టాటిస్టా కంపెనీ డేటాబేస్ వెల్లడించింది.