కొత్తిమీర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. హైబీపీని, రక్తంలో చక్కెర స్థాయిని కొత్తిమీర తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో దోహదపడుతుంది. కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర కణాలను కాపాడుతాయి. కడుపులో మంటను తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను క్రమబద్ధీకరిస్తుంది.