ఉపవాసం చేయడం వల్ల శరీరం శుభ్రం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం నుంచి మంచి ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందాలంటే వారానికి ఒకసారి మాత్రమే చేయాలని సూచిస్తున్నారు. వారంలో ఒక రోజు కేలరీలను విపరీతంగా తగ్గిస్తే.. శరీరంలో కొవ్వును తగ్గించవచ్చు. ఉపవాసం మీ హార్మోన్లను అదుపులో ఉంచుతుంది. రక్తపోటునూ తగ్గిస్తుంది. తక్కువ తినడం వల్ల మీరు తెలివిగా మారవచ్చు అని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.