ప్రస్తుత కాలంలో పెర్ఫ్యూమ్ వినియోగం సర్వసాధారణమైంది. లింగ బేధం లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే పెర్ప్యూమ్ ఎక్కువగా వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పెర్‌ఫ్యూమ్ ఎక్కువగా వాడే వాళ్లకు చర్మ సంబంధ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో పెర్‌ఫ్యూమ్ తయారీలో వాడతున్న రసాయనాలతో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. మంచి వాసన వస్తోందని అతిగా పెర్‌ఫ్యూమ్స్ వాడితే చర్మవ్యాధులతో పాటు ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.