కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో 90 శాతం ఆకస్మిక మరణానికి దారి తీస్తాయి. దీనికి ముందు కనిపించే లక్షణాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని లాన్సెట్ కథనం వెల్లడించింది. కార్డియాక్ అరెస్టుకు 24 గంటల ముందు 50 శాతం మందిలో ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటి లక్షణాలుంటాయని పేర్కొంది. కొందరిలో ఫ్లూ జ్వరం, మూర్చ లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. వీటిని ముందస్తుగా గుర్తిస్తే మరణాలు అరికట్టవచ్చని వెల్లడించింది.