డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం కాషాయ పార్టీ హెలీకాఫ్టర్ లు కూడా బుక్ చేసుకుందన్నారు. బీజేపీ మూడవసారి అధికార పగ్గాలు చేపడితే దేశం నిరంకుశ పాలనలోకి వెళ్లిపోతుందన్నారు. ఇతర పార్టీలకు అవకాశం లేకుండా దేశ వ్యాప్తంగా హెలికాఫ్టర్ లను ఆపార్టీనే బుక్ చేసుకుందన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టె బీజేపీని మట్టికలిపిస్తాం అన్నారు.