ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ తగ్గించేందుకు ఎస్బీఐ అంగీకరించింది. రూ.5లక్షల పైబడిన మొత్తాలపై 12.15శాతం ఉండే వడ్డీ రేటును 2.25% తగ్గించి 9.90%కి ఇచ్చేందుకు ఒకే చెప్పింది. రూ.10లక్షల పైన రుణాలపై 2.45% తగ్గించి 9.70శాతం వడ్డీ విధించనుంది. కాగా రాష్ట్రంలోని పొదుపు సంఘాల రుణాల్లో 4వ వంతు ఎస్బీఐ నుంచే ఉన్నాయి. ఈ తగ్గింపుతో రూ.100కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు.