చెర్రీ పండ్ల జ్యూస్ తరచూ తీసుకోవడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు, వైరస్ల బారిన పడకుండా శరీరానికి రక్షణ కవచం లభిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ చెర్రీ పండ్ల జ్యూస్ తీసుకుంటే బరువు కూడా తగ్గొచ్చంటున్నారు. లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు తరచూ ఈ జ్యూస్ తీసుకుంటే స్త్రీపురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.