దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గడానికి గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి తరచుగా పుక్కిలించి ఊస్తే ఫలితం ఉంటుంది. బాగా నొప్పిగా ఉన్న ప్రాంతంలో కలబంద జెల్‌ని రుద్దితే నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. గోరువెచ్చగా ఉన్న టీ బ్యాగ్ తీసుకుని నొప్పిగా ఉన్న ప్రాంతంలో 5 నిమిషాల పాటు రుద్దితే నొప్పి పోతుంది. వెల్లుల్లి పేస్టును నొప్పిగా ఉన్న ప్రాంతంలో రుద్దితే నొప్పి తగ్గిపోతుంది.