భారతదేశంలో సులువుగా నగదు చెల్లింపులు చేసేలా తమ సేవలను విస్తరిస్తున్నట్లు మెటా నేతృత్వంలోని వాట్సాప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు, వ్యాపార సంస్థల మధ్య అనుసంధానంలో ప్రపంచంలోనే భారత్ ముందుందని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ విషయాన్నిమెటా వ్యవస్థాపకుడు,సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఇక నుంచి వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులకు ఇతర యాప్ లోకి వెళ్లకుండానే నేరుగా వాట్సాప్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చన్నారు.