యాపిల్ యూజర్లకు కేంద్రం కొద్ది రోజుల క్రితం భద్రతాపరమైన అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు తమ డేటా పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా యాపిల్ ఐఓఎస్ 17.0.2 వెర్షన్ ను విడుదల చేసింది. యూజర్లు తమ డివైజ్ లలో కొత్త ఓఎస్ వెర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. కొత్త అప్ డేట్ కోసం ఐఫోన్ సెట్టింగ్స్ లో జనరల్ సెక్షన్ లోకి వెళ్లి సాఫ్ట్ వేర్ అప్ డేట్ పై క్లిక్ చేసి అప్ డేట్ చేసుకోవాలని తెలిపింది.