పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో ఆప్ పార్టీకి మరియు కాంగ్రెస్ కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై ఆప్ కన్వీనర్, ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రతిపక్షాల కూటమిలోనే కొనసాగుతామని తెలిపారు. డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేతను అరెస్టు చేశారని విన్నాను. దీనికి సంబంధించిన వివరాలు నాకు తెలియదన్నారు. ఆప్ ప్రభుత్వం డ్రగ్స్ సమస్యను ముగించే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు.