తూర్పు మధ్య బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.