మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కఠిన నిర్ణయం తీసుకుంది. కొత్త ఐటి నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు నెలలో భారతదేశంలో రికార్డు స్థాయిలో 74,20,748 ఖాతాలను నిషేధించింది. వీటిలో దాదాపు 35,06,905 వినియోగదారుల నుండి ఎటువంటి నివేదికలు రాకముందే ముందస్తుగా నిషేధించబడ్డాయి. భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనికి 500ల మిలియన్లకు పైగా యూజర్లు దేశంలో ఉన్నారు.