బొప్పాయి గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ గింజల్లో ‘పాపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, మలబద్ధకం మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది. వీటిలోని ‘యాంటీఆక్సిడెంట్లు’ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహద పడతాయి. అలాగే ‘ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల వాపు తగ్గుతుంది.