టాటా మోటార్స్ సంస్థ ఇటీవల హారియర్, సఫారీ ఫేస్లిఫ్ట్ వెర్షన్లను లాంచ్ చేసింది. వీటి బుకింగ్లను ప్రారంభించింది. రూ.25వేలు అడ్వాన్స్ చెల్లించి ఈ కార్లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. సఫారి కొత్తవెర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 16.30 kmpl, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 14.50 kmpl మైలేజీని అందించనుంది. దీనిధర రూ.16లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉండొచ్చని అంచనా.