కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మిటమిన్లు A,C,Eతో కూడిన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు ప్రశాంతమైన నిద్ర కూడా ముఖ్యం. కనీసం ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి. కళ్లు హైడ్రేటెడ్ గా ఉండేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎండలోకి వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. డిజిటల్ స్క్రీన్ ఎక్కువగా చూడరాదని నిపుణులు సూచిస్తున్నారు.