అప్పుడప్పుడు నిద్రలో మెడ పట్టేయడంతో ఉదయం నిద్ర లేస్తున్నపుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. మెడను తిప్పడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిలో ఉపశమనం పొందేందుకు ఆరోగ్య నిపుణులు పలు చిట్కాలు సూచిస్తున్నారు. మార్కెట్లో దొరికే హాట్ వాటర్ బ్యాగ్ ను మెడ చుట్టూ ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా నీరు అధికంగా తాగటం, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని అంటున్నారు. ఎత్తుగా ఉండే దిండును వాడకూడదని సూచించారు.