ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ సమస్య సంతాన సాఫల్యం. పెళ్లై ఎన్నేళ్లైనా చాలా మందికి పిల్లలు పుట్టడం లేదు. కొన్ని రకాల ఆహారాలు సంతాన సాఫల్యతను పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలను దూరం చేయడంలో దానిమ్మ చక్కగా పనిచేస్తుంది. మహిళల గర్భాశయంలో రక్తప్రసరణను పెంచి పురుషుల వీర్యకణాల సంఖ్య, నాణ్యతను దానిమ్మ రెట్టింపు చేస్తుంది. త్వరగా పిల్లలను కనాలనుకునేవారు దానిమ్మను ఏదో ఒక రూపంలో రోజూ తీసుకోవడం మంచిది.
పాలు, పాలపదార్థాలు సంతాన సమస్యలను దూరం చేస్తాయి. ఇందులోని విటమిన్లు స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని పెంచి సంతానోత్పత్తి అవకాశాలను రెట్టింపు చేస్తాయి. ఖర్జూరాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ కూడా త్వరగా గర్భం దాల్చేందుకు దోహదం చేస్తాయని చాలా అధ్యయనాల్లో తేలింది. సిట్రస్ ఫ్రూట్స్‌ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా త్వరగా తల్లీదండ్రులయ్యే అవకాశమందంటున్నారు డాక్టర్లు. మహిళల్లో ప్రత్యుత్పత్తిని వేగవంతం చేయడంలో విటమిన్ ‘సి’ సహకరిస్తుందని తేల్చారు. వీటితో పాటు సరైన జీవన విధానం, మంచి ఆహారం, సరిపడా నిద్ర వంటివి సంతాన సమస్యలను దూరం చేస్తాయి.