వయసుతో సంబంధం లేకుండా చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు రావడమే కాకుండా కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. అయితే యూరిక్ యాసిడ్ నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలి. తమలపాకులతో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు. ప్రతి రోజు 2 నుంచి 3 ఆకులు తిన్నట్లయితే శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.