క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.రక్తహీనత సమస్యతో బాధపడేవారు వారు రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ ను తాగాలి. ఒక జార్ లో రెండు క్యారెట్ లు, ఒక కీరదోస, రెండు టమాటాలు, ఒక చిన్న బీట్ రూట్ వేసి జ్యూస్ గా చేయాలి. తర్వాత ఈ జ్యూస్ ను వడకట్టి దానికి ఎండు ఖర్జూరాల పొడిని కలపాలి. అలాగే రెండు టీ స్పూన్ల తేనెను కలపాలి. ఇలా తయారు చేసుకున్న క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు నీరసం తగ్గుతుంది.