వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలను డాక్యుమెంట్‌ల రూపంలో వేగంగా పంపేందుకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల నేరుగా గ్యాలరీ నుంచి మీడియా ఫైల్స్‌ను షేర్ చేయవచ్చని అన్నారు. రిసీవర్లు ఎలాంటి క్వాలిటీ కోల్పోకుండా ఆ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. 2జీబీ వరకు స్టోరేజ్ ఫైల్స్ పంపవచ్చన్నారు.