డయాబెటిస్ రోగులకు కాఫీతో మంచి ప్రయోజనం ఉన్నట్టు కొత్త అధ్యయనం తేల్చింది. రోజూ కాఫీ తాగే షుగర్ రోగుల్లో 'డయాబెటిక్ రెటినోపతి' అనే సమస్య లు రావని నిపుణులు తెలిపారు. మధుమేహం వ్యాధి ఉన్నవారిలో రోజుకు రెండు కప్పుల కాఫీ కంటే అధికంగా తాగుతున్న వారిలో 'డయాబెటిక్ రెటినోపతి'ప్రాబ్లెమ్ కనిపించలేదు. ఒక కప్పు కాఫీ తాగేవారిలో మాత్రం ఈ ఫలితం చాలా భిన్నంగా ఉంది. బ్లాక్ కాఫీ తాగినా కూడా మధుమేహుల్లో డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్స్ తగ్గినట్టు నిపుణులు పేర్కొన్నారు.