రవాణా, పోలీస్ విభాగాలు సంయుక్తంగా శనివారం తెనాలిలో ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటం, ఇతర నిబంధనలు పాటించని వారిపై మొత్తం 21 కేసులు నమోదు చేశారు. వారికి రూ. 1. 23 లక్షల అపరాధ రుసుం విధించారు. తెనాలి పట్టణ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.